బంపర్ ఆఫర్ అందుకున్న డిజాస్టర్ బ్యూటీ.. ఈ సారైనా లక్ కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ రాశిసింగ్(Rashi Singh) ‘శశి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

బంపర్ ఆఫర్ అందుకున్న డిజాస్టర్ బ్యూటీ.. ఈ సారైనా లక్ కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రాశిసింగ్(Rashi Singh) ‘శశి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో అమ్మడుకి ఫుల్ పాపులారిటీ దక్కింది. తెలుగులో అనతి కాలంలోనే అమ్మడు క్రేజీ బ్యూటీగా మారి వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇటీవల ‘బ్లైండ్ స్పాట్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ ‘పాంచ్‌మినార్’ (Panchminar)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈక్రమంలో.. తాజాగా, రాశి సింగ్ మరో మూవీని ప్రకటించింది. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu)సినిమాలో నటిస్తున్నట్లు తెలుపుతూ దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కాగా, గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వడ్డే నవీన్ ఈ మూవీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. రఘుబాబు, బాబా మాస్టర్, సాయిశ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వడ్డే క్రియేషన్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి వడ్డే నవీన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story