- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధార్థ్ ‘రౌడీ అండ్ కో’ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddharth)ఇటీవల 3BHK చిత్రంతో మరోసారి తన మార్కెట్‌ను బలంగా నిరూపించుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో సిద్ధార్థ్(Siddharth) ఇటీవల 3BHK చిత్రంతో మరోసారి తన మార్కెట్‌ను బలంగా నిరూపించుకున్నాడు. ఈ సినిమా వచ్చిన వెంటనే ఆయన కెరీర్ కొత్త ఊపును అందుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాల్లో ‘రౌడీ అండ్ కో’(Rowdy and Co.) ప్రధానంగా నిలుస్తోంది. యాక్షన్ ప్రాధాన్యం ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన రాశీ ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీని ఆవిష్కరించనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. పాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మాణం అవుతోంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. టైటిల్ మాత్రం కొంచెం విభిన్నంగా ఉన్నప్పటికీ, అందులో దాగి ఉన్న కాన్సెప్ట్ యాక్షన్‌కు సంబంధించి ఉండటంతో ఆసక్తిని పెంచింది. సిద్ధార్థ్ గెట్టప్, లోకేషన్‌లు, లుక్ ఇలా అన్ని కలిపి ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సమ్మర్ హాలిడేస్‌ను టార్గెట్ చేస్తూ విడుదల చేస్తే భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ఈ కథకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో క్యారెక్టర్స్ కంటే పరిస్థితుల వల్లే కామెడీ పుట్టింది.
రౌడీ అండ్ కో అనేది కుటుంబంతో వచ్చి సరదాగా నవ్వుతూ, ఆనందంగా చూసి వెళ్లిపోయేలా ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక రోజు ఈ కథ నాకు చాలా క్యాజువల్‌గా వచ్చింది. కానీ కథను ఆలోచిస్తుంటే, అది సహజంగానే చాలా కామెడీని సృష్టించే విధంగా మారిపోయింది. ఈ రోజుల్లో ప్రతి విషయం కూడా చాలా కార్పొరేట్‌గా మారిపోయింది. ఇదే ఆలోచనతో… “రౌడీగా ఉండటం కూడా కార్పొరేట్ అయితే ఎలా ఉంటుంది? రౌడీ పనులు చేసే ప్రత్యేకమైన కంపెనీ ఉంటే?” అని ఊహించాం. ఆ ఒక్క లైన్ నుంచే ఈ సినిమా మొత్తం పుట్టింది. ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ, పరిస్థితులే నవ్వులు పండించే వినోదభరితమైన కథగా రూపుదిద్దుకుంటుంది’’ అని చెప్పారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది.






