- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీపై స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్
‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన ట్వీట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన ట్వీట్ చేశారు. ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడ్డ సందర్భంగా ఆయనపై విమర్శలు గుప్పించారు. ‘‘రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ అనర్హుడిగానే ఉన్నారు.. అది ఇప్పుడు అధికారికంగా రుజువైంది’’ అంటూ రాహుల్ సస్పెన్షన్‌ను దృష్టిలో ఉంచుకుని షాకింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఇందీరా గాంధీ గురించి సైతం అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇందీరా గాంధీపై కూడా అనర్హత వేటు పడిందని.. కాకపోతే ఆమె బలమైన నాయకురాలు కావడంతో తిరిగి నిలదొక్కుకున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. కాగా, వివేక్ అగ్నిహోత్రి రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇక, 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలో రాహుల్ గాంధీ మోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పమైన సంగతి తెలిసిందే. పేరు చివర మోడీ అని ఉన్న వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లే ఎందుకు అవుతారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఈ కేసును విచారించిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంతో పాటు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఆధారంగా లోక్ సభ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు.
Rahul Gandhi was always unqualified. It’s just that now it’s been made official.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023






