Sukumar about Baby Movie :‘బేబీ’ సినిమాపై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర పోస్ట్..

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-19 08:33:18  IST  )

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు.

Sukumar about Baby Movie :‘బేబీ’ సినిమాపై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించగా.. SKN నిర్మాణంలో వచ్చింది. జూలై 14న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా లవ్, ఫెయిల్యూర్ యూత్‌కు కనెక్డ్ అవుతుంది. దీంతో ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రీటిలు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా, డైరెక్టర్ సుకుమార్ బేబీ మూవీపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘చాలా కాలం తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనలు చూశాను. కచ్చితంగా ఈ సినిమా సినిమా రచనలలో ఓ కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది. సినిమాలోని పాత్రల తరహాలో పరిస్థితులు ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. డైరెక్టర్ సాయి రాజేష్ కు అభినందనలు. ఇలాంటి సినిమాని నమ్మి నిర్మించినందుకు SKN మరియు మారుతీలను అభినందిస్తున్నాను. వైష్ణవి ఇప్పటివరకు రాసిన ఐకానిక్ పాత్రలలో ఒకటి. వైష్ణవి చైతన్య దానిని పూర్తిగా ఆవహించుకొని ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. ఆనంద్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. విరాజ్ కూడా బాగా చేశాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందమైన దృశ్యంలా ఉంది. బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. బేబీ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అంటూ రాసుకొచ్చారు.

Read More: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘project-k’ ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్

Next Story