‘దసరా’లో కీర్తి నటించడం నాకు ఇష్టం లేదు.. అంతా నాని వల్లే

by Disha Web Desk 12 |
‘దసరా’లో కీర్తి నటించడం నాకు ఇష్టం లేదు.. అంతా నాని వల్లే
X

దిశ, సినిమా: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘దసరా’. ఈ శ్రీ రామనవమి సందర్భంగా విడుదలైన మూవీ గురించి దర్శకుడు శ్రీకాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కథను మొదట నానికి వినిపించానని, దీంతో ఆయన హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరును సూచించాడని చెప్పాడు. అయితే ఇద్దరు స్టార్స్‌ను డీల్ చేయడం కష్టమని ఆమెకు నో చెప్పాడట. ‘తెలుగమ్మాయి అయితే బాగుంటుందనుకున్నా. చాలా వెతికాను. ఎవరు దొరకలేదు. చివరికి కీర్తికే కథను వినిపించాను.

అయితే ఈ కథను ఆమె రిజెక్ట్ చేయాలని నేను కోరుకున్నట్లే.. మొదట నచ్చలేదని చెప్పింది. దీంతో చాలా సంతోషించాను. అదే విషయం నానికి చెప్పడంతో.. తనకు కథ అర్థం కాలేదని, మరోసారి ట్రాన్స్‌లేటర్ సహాయంతో స్టోరీ వినిపించాడు. తర్వాత ఆమె అంగీకరించడం, తొలిరోజు షూటింగ్‌లో భాగంగా కీర్తి పేడ కలపడంతో నాకు చాలా ఉత్సాహం పెరిగింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక వెన్నెల పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేక పోయా’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి: ‘దసరా’ ట్విట్టర్ రివ్వూ.. సినిమా ఎలా ఉందంటే..?


Next Story

Most Viewed