- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ అభిమానుల ట్రోల్స్ దెబ్బకు భయపడిపోయిన డైరెక్టర్.. క్షమాపణలు కోరుతూ ట్వీట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan), సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సినీ ప్రియులంతా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ డైరెక్టర్ కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ తప్పుగా పెట్టి ట్రోల్స్‌కు గురవుతున్నాడు.
అసలు అందులో ఏముందంటే.. ‘‘ఇప్పుడే ది రాజా సాబ్ టీజర్ చూశాను. నన్ను నమ్మండి.. ఈ జానర్‌లో ఇండియాలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలవబోతోంది. ఇందులో ప్రభాస్ చాలా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మారుతి మీరు చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా అద్భుతమైన క్షణాలను నేను ఆస్వాదించాను. అటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీ నిర్మాణ విలువలు అసాధారణంగా, ఊహించని విధంగా ఉన్నాయి.
2026 జనవరి 9న ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఒక సుమాని సృష్టించబడుతోంది.. సిద్దంకండి’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు టీజర్ కాదు అది ట్రైలర్ కావచ్చు అది కూడా గుర్తులేదా అని ట్రోల్స్ చేస్తు్న్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోనా వెంకట్ మరో ట్వీట్ చేశాడు. ‘‘దయచేయి నన్ను క్షమించండి.. టీజర్ కాదు ట్రైలర్ చూశాను’’ అని తప్పును సరి చేసుకున్నాడు. ప్రభాస్ అభిమానుల దాడికి భయపడిపోయిన కోన వెంకట్‌కు షాక్ తగిలినట్లు అయింది.






