ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఖుషీలో ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల యానిమల్ మూవీతో ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ‘స్పిరట్’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ మొదలవ్వకపోయినా టైటిల్‌ను మాత్రం ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ ‘స్పిరిట్’ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ ఇప్పుడు నేను ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సిపిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది హారర్ మూవీ కాదు. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్ వరకే చెప్పగలను’’ అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డార్లింగ్‌ను పోలీస్ గెటప్‌లో చూడాలని తెగ ముచ్చటపడుతున్నారు. అంతేకాకుండా తొందరగా షూటింగ్ పూర్తి చేసి సినిమా అప్డేట్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

Read More..

‘యానిమల్‌’ మూవీ సీక్వెల్‌లో మరో బాలీవుడ్ స్టార్ హీరో..!

Next Story

Most Viewed