- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు బండి సరోజ్ కుమార్‌తో విభేధాలు.. అసలు నిజాలు బయటపెట్టిన డైరెక్టర్
ఓ సినిమా నిర్మాణంలో ఎంతోమంది కలిసి పని చేస్తున్న క్రమంలో.. నటీనటులు, డైరెక్టర్ మధ్య పలు మనస్పర్థలు తలెత్తడం కామన్.

దిశ, సినిమా: ఓ సినిమా నిర్మాణంలో ఎంతోమంది కలిసి పని చేస్తున్న క్రమంలో.. నటీనటులు, డైరెక్టర్ మధ్య పలు మనస్పర్థలు తలెత్తడం కామన్. అలాగే ఈ వివాదాలను మర్చిపోయి కొందరు ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడతారు. ఆ విషయాలను కూడా బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. మరికొందరు మాత్రం అందరికీ తెలిసేలా చేస్తారు. ఇలా ఎంతోమందికి మనస్పర్థలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇటీవల విశాల్ ‘మకుటం’ సినిమా విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. డైరెక్టర్‌తో గొడవలు జరగడంతో తన చిత్రాన్ని తనే తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఇక ఇప్పుడు నటుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar), డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ‘మోగ్లీ’ (Mowgli) సినిమా చేస్తుండగా.. వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై సందీప్ రాజ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
‘‘అలాంటిదేం లేదు. బయట చూసేవాళ్ళకి అలా అనిపించడానికి కారణమేంటంటే.. నేను ఇప్పటిదాకా సుహాస్, హర్ష వంటి ఫ్రెండ్స్ తోనే వర్క్ చేశాను. ఏదైనా సీన్ బాగా వచ్చిందంటే, వెళ్లి టక్కన వాటేసుకుంటాం.. ముద్దులు పెట్టుకుంటాం. సెట్లు ఇవన్నీ కనిపిస్తాయి. రోషన్ తో ఈ రెండేళ్ల జర్నీ వల్ల అతనితో కూడా అలాంటిది కనిపిస్తుంది. కానీ సరోజ్ కుమార్ ఎంత కాదన్నా నాకన్నా పెద్దోడు. ఆయనపై ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు.. 'బ్రో బాగుంది.. చాలా బాగా చేశావ్' అని నేను చెప్పగలను. అందరితో ఉన్నంత క్లోజ్ గా ఆయనతో ఉండకపోవటం వల్ల అలా అనిపించొచ్చు కానీ.. బేసిక్ గా మేము ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు.
ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి నాకు సలహాలు ఇవ్వటం, నేను అది ఫాలో అవ్వడం కూడా జరిగింది. కాబట్టి మా మధ్య విబేధాలు అనేవి ఏమీ లేవు. చాలా హ్యాపీగా షూటింగ్ చేసుకున్నాము. ఒకవేళ ఏవైనా క్రియేటివ్ డిస్కషన్స్, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా కూడా.. తను అనుకుంది చేసి చూపించి ఓకేనా అని అడుగుతాడు. అలా తను అనుకున్నవి ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చేస్తే సూపర్ ఉంటదని నేను అంటే.. అవును ఇదే బాగుందని సరోజ్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఇలాంటి డిస్కషన్స్ జరిగాయి తప్పితే.. విబేధాలు వచ్చేంత ఏమీ జరగలేదు’’ అని అన్నారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.






