- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mokshagna: మోక్షజ్జ సినిమా ఓపెనింగ్ వాయిదా పడటానికి కారణం.. లాస్ట్ మినిట్‌లో బాలయ్య ఫోన్ చేసి ఏం చెప్పాడు?
తేజ సజ్జా(Teja Sajja) హీరోగా హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Director Prashanth Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: తేజ సజ్జా(Teja Sajja) హీరోగా హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Director Prashanth Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీ థియేటర్ల వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో చాలా మంది నటీనటులు ప్రశాంత్ వర్మ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే నందమూరి సీనియర్ ప్రముఖ హీరో బాలకృష్ణ(Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ(Mokshagna) ఈ దర్శకుడి డైరెక్షన్‌లో.. అతడి ఫస్ట్ మూవీ రాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న (డిసెంబరు 5) నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. కానీ ఈ పూజా కార్యక్రమం వాయిదా పడిందట. కారణమేంటని జనాలు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుండగా... నందమూరి వారసుడు మోక్షజ్ఞకు హెల్త్ బాలేదని బాలయ్య లాస్ట్ మినిట్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఫోన్ చేసి చెప్పారట. ఇక మోక్షజ్ఞ కొత్త మూవీ ఓపెనింగ్ కోసం రామానాయుడు స్టూడియో(Ramanaidu Studio)లో ఘనంగా సెట్ వేశారట. దీనికోసం ఏకంగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటూ నెట్టింట టాక్ వినిపిస్తుంది. మరీ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఓపెనింగ్‌కు ఎప్పుడు ముహూర్తం వస్తుందో అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికన కామెంట్లు చేస్తున్నారు.






