Allu Arjunపై డైరెక్టర్ మారుతి స్పెషల్ ట్వీట్.. Prabhas ఫ్యాన్స్ ఫైర్ ఎందుకంటే?

by Disha Web Desk 6 |
Allu Arjunపై డైరెక్టర్ మారుతి స్పెషల్ ట్వీట్.. Prabhas ఫ్యాన్స్ ఫైర్ ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా జూలై 14న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందరినీ ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరై బేబీ యూనిట్‌ను ప్రశంసించాడు.

తాజాగా, దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ మారుతి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారు మా చిత్రం ‘బేబీ’ సినిమాపై ప్రశంసల సమావేశం. మా టీమ్ మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ఈ ఐకానిక్ అప్రిషియేషన్‌కి ధన్యవాదాలు సార్, ఇది పెద్ద బూస్ట్. మీ ఎనలేని ప్రేమతో మేము ఉప్పొంగిపోయాము’’ అంటూ రాసుకొచ్చారు.

దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్రస్తుతం కల్కి షూటింగ్‌లో ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్న మారుతి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘అసలు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం పెద్ద అచీవ్ మెంట్ మనకి సలార్ టీజర్, మరియు Kalki- 2898 AD గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటి గురించి తెలుసా అండి మీకు ??క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ గారు మారుతీ. ఒక్క ట్వీట్ వేస్తే నీ బ్రాండ్ ఎమ్ పొదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: Akhil Sarthak ను చీట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

Next Story

Most Viewed