దర్శకుడు కార్తీక్ దండు బర్త్‌డే స్పెషల్.. ‘వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖరారు..

by Mallepaka Hamsa |

అక్కినేని ఫ్యాన్స్‌లో నెలకొన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ మూవీ మేకర్స్ ‘వృషకర్మ’ నుంచి అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

దర్శకుడు కార్తీక్ దండు బర్త్‌డే స్పెషల్.. ‘వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖరారు..
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ప్రస్తుతం తన కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘తండేల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు నాగచైతన్య తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma)షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌తో మెప్పించిన దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో నాగచైతన్య సరసన క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అక్కినేని అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుందా? లేక ఆలస్యమవుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే, ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్‌లో నెలకొన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ మూవీ మేకర్స్ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. నేడు దర్శకుడు కార్తీక్ దండు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మూవీకి సంబంధించిన ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. మార్చి 5న ‘వృషకర్మ’ నుంచి ఒక క్రేజీ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కార్తీక్ దండు మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు నాగచైతన్యను మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో ఈ గ్లింప్స్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ దండు తన గత సినిమా ‘విరూపాక్ష’తో సృష్టించిన మ్యాజిక్‌ను ఈ మూవీతో కూడా రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చాలా కాలం తర్వాత అప్‌డేట్ వస్తుండటంతో సోషల్ మీడియాలో నాగచైతన్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Next Story