లైఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కే షాక్ ఇచ్చిన ప్రియదర్శి

by Disha Web Desk 7 |
లైఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కే షాక్ ఇచ్చిన ప్రియదర్శి
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఓ వైపు కమెడియన్‌గా చేస్తునే మరోవైపు అడపదడప సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ‘బలగం’ సినిమాతో అలరిస్తున్నాడు. దిల్‌రాజు ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై, శిరీష్ స‌మ‌ర్పణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతంచేసుకుని దూసుకుపోతుంది. ఈ మూవీతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం కాగా.. మూవీ టీమ్ ఈటీవీలోని ‘సుమ అడ్డ’ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు.

రకరకాల ప్రశ్నలేస్తూ వారితో ఒక ఆట ఆడుకున్న సుమ.. ‘ప్రియదర్శిని మీ మొబైల్‌లో పర్మినెంట్‌గా ఓ నెంబర్ డిలీట్ చేయాలంటే ఇందులో ఎవరిది చేస్తారు. A. తరున్ భాస్కర్, B. వేణు గారు’ అని ఆప్షన్ ఇచ్చింది. వెంటనే తరుణ్ భాస్కర్ పేరు చెప్పాడు హీరో. అయితే ‘పెళ్ళి చూపులు’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన భాస్కర్ పేరు చెప్పడంతో అందరూ ఆశ్యర్యపోయారు. ప్రియదర్శి ఎందుకలా చెప్పాడో తెలియాలంటే శనివారం వచ్చే పూర్తి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Next Story

Most Viewed