Shaakuntalam : "శాకుంతలం" సినిమాకు షాక్ ఇచ్చిన దిల్ రాజు

by Disha Web Desk 10 |
Shaakuntalam : శాకుంతలం సినిమాకు షాక్  ఇచ్చిన దిల్ రాజు
X

దిశా, వెబ్ డెస్క్ : సమంత నటించిన తాజా సినిమా " శాకుంతలం ". ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వాయిదా పడ్డ ఈ సినిమా, మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను సమర్పిస్తున్న దిల్ రాజు చేతులెత్తేశాడని టాలీవుడ్ వర్గాల వారు టాక్. మహా భారతంలో శకుంతల, దుష్యంతుడు ప్రేమ కథనే డైరెక్టర్ గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో శకుంతల పుట్టుక నుంచి భరతుడు పుట్టుక వరకు శాకుంతలం కథ నడుస్తుందని తెలిసిన సమాచారం. మహా భారతంలో శకుంతల, దుష్యంతుడు ప్రేమ కథకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పురాణ ప్రేమ కథకు దృశ్య రూపం అందించాడు.. డైరెక్టర్ గుణ శేఖర్ పాన్ ఇండియా రేంజులో రూపొందిస్తున్న ఈ సినిమా 3D లో కూడా తెరకెక్కింది. ఈ సినిమా కోసం గుణశేఖర్ భారీగానే ఖర్చు పెట్టాడు. సమంత సినీ కెరియర్లో శాకుంతలం సినిమా హైయెస్ట్ బడ్జెట్ గా నిలిచింది. ఫిబ్రవరి 17 న శాకుంతలం విదులవ్వడం లేదు.. మరోసారి వాయిదా పడడంతో దిల్ రాజు ఇక నా వల్ల కాదని.. చేతులెత్తేశాడని టాక్ నడుస్తుంది.

Next Story

Most Viewed