- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచు ఫ్యామిలీలో విభేదాలు.. పోస్ట్‌తో అసలు నిజాలు బయటపెట్టిన మంచు లక్ష్మీ
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

దిశ, సినిమా: మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో వీరిద్దరూ రోడ్డు మీదకు వచ్చి కొట్టుకోవడమే కాకుండా, పోలీసుల వరకు కూడా వెళ్లారు. ఆస్తుల గొడవలతో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గొడవలన్నీ సర్దుమణిగాయని అందరూ అనుకునేలా ఒక వార్త బయటకు వచ్చింది. మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ ఫంక్షన్ హైదరాబాద్‌లో చాలా ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తండ్రి మోహన్ బాబుతో పాటు, తమ్ముళ్లు విష్ణు, మనోజ్ తమ భార్యాపిల్లలతో కలిసి హాజరయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా ఒక్కటేనని చాటిచెప్పేలా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.
అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఫంక్షన్‌కు అందరూ వచ్చారు కానీ, అందరూ కలిసున్న ఒక్క ఫోటో కూడా లేదు. విద్యా నిర్వాణకు నలుగు పెట్టే సమయంలో తీసిన ఫోటోల్లో మంచు మనోజ్ కుటుంబం కనిపించలేదు. అలాగే, ఇతర వేడుక ఫోటోల్లో విష్ణు, మోహన్ బాబు కుటుంబాలు కనిపించకపోవడం గమనార్హం. దీంతో, అక్క కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే చోటుకు వచ్చారు కానీ.. ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదని, కలిసున్న ఫోటోలకు కూడా ఇష్టపడలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గొడవలు తగ్గినట్టు కనిపిస్తున్నా, మనసులు మాత్రం ఇంకా కలవలేదని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోందని పలు రకాలుగా అనుకుంటున్నారు.






