జరగండి పాటకి అంత ఖర్చు పెట్టారా .. అయినా తుస్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్

by Disha Web Desk 10 |
జరగండి పాటకి  అంత ఖర్చు పెట్టారా .. అయినా తుస్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ,సినిమా: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన జరగండి పాట.. హైప్ క్రియోట్ చేస్తుందని అనుకున్నారు, కానీ అంచనాలను తారుమారు చేసింది. గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ అయినా ఈ పాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ పాటకి పెట్టిన డబ్బులతో నాలుగు చిన్న సినిమాలు తీయవచ్చని నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. ఇంతకీ ఎంత ఖర్చు పెట్టారో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ మూవీ అప్డేట్స్ కోసం చెర్రీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో చరణ్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. మెగా అభిమానుల కోసం గేమ్ చేంజర్ సినిమా నుంచి "జరగండి" అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాసారు. ఈ సాంగ్ కోసం దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ, చెర్రీ అభిమానులు చాలా హర్ట్ అయినట్లు అర్దమవుతుంది.

కాపీ కొట్టిన పాటను రామ్ చరణ్ కు ఎలా పెడతారంటూ అభిమానులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా, షణ్ముఖ్‌ సినిమాతో పోల్చి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 24 గంటల్లో ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ పాటకి 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే వచ్చాయి.

Read More..

చరణ్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన ఉపాసన-ఎన్టీఆర్..?


Next Story

Most Viewed