Tamannaah Bhatia: ఐదు నిమిషాల పాటకి తమన్నా అంత రెమ్యునరేషన్ తీసుకుందా?

by Prasanna |
Tamannaah Bhatia: ఐదు నిమిషాల పాటకి తమన్నా అంత రెమ్యునరేషన్ తీసుకుందా?
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు యాడ్స్, ఇంకో వైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయింది. అలాగే, అవకాశం వచ్చినప్పుడు మల్టీ లాంగ్వేజ్ స్ లో స్పెషల్ సాంగ్స్ లో తన సత్తా చూపుతుంది. ముఖ్యంగా తన డ్యాన్స్ తో అందర్ని ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.అయితే, ఆ పాట ఆమె గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్.

హీరో రాజ్‌ కుమార్‌ రావు, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కలిసి నటించిన హారర్‌ మూవీ ‘స్త్రీ 2’. ఈ మూవీ ఆగస్ట్‌ 15న రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. దీనిలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ‘ఆజ్‌ కి రాత్‌’ అనే పాటలో ఆమె స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సాంగ్ మూవీ కి బాగా హెల్ప్ అయింది. అయితే, 5 నిముషాల కోసం రూ. కోటి తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. తమన్నా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం మొదటి సారి. మిల్క్ బ్యూటీ అంటే ఆ మాత్రం ఉండాలిగా అంటున్నారు. మరి కొందరైతే ఇంకా ఎక్కువ ఇచ్చిన తప్పు లేదు .. పాటకి వంద శాతం న్యాయం చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed