పుష్ప2లో శ్రీవల్లి అదిరిపోయే లుక్.. ఆ హీరో భార్యను చూసే అలా రెడీ చేశారా?

by Disha Web Desk 8 |
పుష్ప2లో శ్రీవల్లి అదిరిపోయే లుక్.. ఆ హీరో భార్యను చూసే అలా రెడీ చేశారా?
X

దిశ, సినిమా : ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే ముచ్చటిస్తున్నారు నెటిజన్స్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇదొకటి. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని నెటిజన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లి న్యూ లుక్ నెట్టింటె తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎర్రటి చీరలో ఒంటినిండా నగలు, కొప్పు నిండా పూలు పెట్టుకొని శ్రీవల్లి అదిరిపోయింది. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే శ్రీవల్లి లుక్‌‌కు పుష్ప ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా, సుకుమార్ చాలా తెలివిగా ఆలోచించి ఓ స్టార్ హీరో భార్యలా శ్రీవల్లిని తయారు చేశారు. ఆ హీరో భార్యను చూసే, శ్రీవల్లిని అలా కొత్తగా డిజైన్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read More..

అనుపమతో వేదికపై సిద్దు జొన్నలగడ్డ చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్


Next Story

Most Viewed