- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారక్ వల్లే శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చిందా.. అసలు నిజాలు చెప్పేసిన ఆమె తల్లి (వీడియో)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (sreeleela) వరుస సినిమాలతో పాటు ఐటమ్స్ సాంగ్స్‌లోనూ చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (sreeleela) వరుస సినిమాలతో పాటు ఐటమ్స్ సాంగ్స్‌లోనూ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘మాస్ జాతర’(mass jathara) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, శ్రీలీల ఓ ప్రోగ్రాంకు హాజరైంది. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి ఆమె తల్లి కూడా వచ్చి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో జగపతి బాబు తారక్ చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్న ఫొటోను చూపించగా.. అది చూసిన శ్రీలీల తల్లి స్వర్ణలత(Swarnalata).. ఆ ఫొటో చూశాకే నాకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించి ఇండస్ట్రీకి పంపాలనుకున్నాను. 1997లో లాజ్ ఏంజిల్స్‌లో తానా సభలు జరిగాయి. మేము కూడా అక్కడికి వెళ్లాము. తారక్ డ్యాన్స్ చేసిన అనంతరం మాట్లాడాను. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్ చేయిస్తాను అని చెప్పాను. అనుకున్నట్లుగానే శ్రీలీలను డ్యాన్సర్‌ను చేశాను. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నా కూతురు డ్యాన్సర్ అయింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు వావ్ గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






