సీక్రెట్‌గా పూజా హెగ్డే ఎంగేజ్‌మెంట్ చేసుకుందా!.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేయగా.. అందులో ఆమె చేతికి ఒక రింగు కనిపించడంతో అంతా సీక్రెట్‌గా బుట్టబొమ్మ ఎంగేజ్మెంట్ చేసుకుందని చర్చించుకుంటున్నారు .

సీక్రెట్‌గా పూజా హెగ్డే ఎంగేజ్‌మెంట్ చేసుకుందా!.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో అంతా ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేసిన ఈ భామ ఇప్పుడు అచీతూచీ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు మళ్లీ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంటూ షామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పూజా, వరుణ్ ధావన్, మృణాల్ కాంబోలో రాబోతున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ అమ్మడు ప్రేమలో పడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఎంగేజ్‌మెంట్ కూడా సీక్రెట్‌గా చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేయగా.. అందులో ఆమె చేతికి ఒక రింగు కనిపించడంతో అంతా సీక్రెట్‌గా బుట్టబొమ్మ ఎంగేజ్మెంట్ చేసుకుందని చర్చించుకుంటున్నారు . గత కొద్ది కాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఆమె అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుందా? అనే అనుమానాలు వక్తమవుతున్నాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే పూజా, రోహన్ ఉండే ముంబైలోనే కావడంతో నిత్యం రెస్టారెంట్లకు, ఫంక్షన్లకు హాజరవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనతో తన జీవితాన్ని పంచుకునేందుకు పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కావచ్చని అంతా చర్చించుకుంటున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.


Next Story