అప్పుడే జాను రెండో పెళ్లి చేసుకుందా.. నెట్టింట వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటో.. శోభనం వీడియో కూడా..

by I. Sairam |   (  Updated:2025-05-05 06:19:49  IST  )

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ ఫుల్ పాపులర్ అయిన జాను లిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అప్పుడే జాను రెండో పెళ్లి చేసుకుందా.. నెట్టింట వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటో.. శోభనం వీడియో కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ ఫుల్ పాపులర్ అయిన జాను లిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ఫేమ్‌తో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి ప‌ర్‌ఫార్మెన్స్‌తో విజేత‌గా నిలిచి, సెల‌బ్రిటీ స్టేట‌స్ సాధించింది. అయితే అక్కడ శేఖర్ మాస్టర్ ఈ బ్యూటీకి బాగా సపోర్ట్ చేయడంతో నెట్టింట తెగ ట్రోల్స్‌కి గురి అయింది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా ఏం చేసిన విమర్శల పాలవుతునే ఉండేది. దీంతో సహనం కోల్పోయిన ఈ బ్యూటీ చచ్చిపోతానని ఓ వీడియో రిలీజ్ చేసింది.. ఆ తర్వాత రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాను అందరూ ఆశీర్వదించండి అని అబ్బాయితో ఉన్న ఫొటో షేర్ చేసి బిగ్ బాంబ్ పేల్చింది.

ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో జానీ లిరీ, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌లు మెడలో పూలదండ వేసుకుని కనిపించారు. అలాగే ఈ వీడియోకు జల్దీ రావా బావా సాంగ్‌ను యాడ్ చేశారు. దీంతో జాను అప్పుడే రెండో పెళ్లి కూడా చేసుకుందా అని సందేహ పడుతున్నారు, అలాగే ఇప్పుడు పెళ్లి వీడియో తర్వాత శోభనం వీడియో కూడా పెట్టండి చూసి తరిస్తామని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆ ఫొటో ఎడిటింగ్ చేసిందని కొట్టిపారేస్తున్నారు.

Read More..

రెండో పెళ్లి గురించి చెప్పేందుకేనా జాను లిరి డిప్రెషన్ డ్రామాలు.. పొట్టు పొట్టు వేసుకుంటున్న నెటిజన్లు..


Next Story