- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో పెళ్లి గురించి చెప్పేందుకేనా జాను లిరి డిప్రెషన్ డ్రామాలు.. పొట్టు పొట్టు వేసుకుంటున్న నెటిజన్లు..
ఓ ఫోక్ డ్యాన్సర్.. సారీ ‘ఢీ’ విన్నర్ కూడా.. గుర్తొచ్చే ఉంటుంది కదా జాను లిరి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ వల్లే ఈ అమ్మాయికి పాపులారిటీ మరింత పెరిగింది. ఏ స్టెప్

దిశ, ఫీచర్స్ : ఓ ఫోక్ డ్యాన్సర్.. సారీ ఢీ విన్నర్ కూడా.. గుర్తొచ్చే ఉంటుంది కదా జాను లిరి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ వల్లే ఈ అమ్మాయికి పాపులారిటీ మరింత పెరిగింది. ఏ స్టెప్ వేసినా.. ఏ సాంగ్‌కు డ్యాన్స్ చేసినా.. జానూ జానూ జానూ అంటూ కామెంట్స్ చెప్పేవాడు. ఆమెలాగా ఎవరు కూడా స్టెప్స్ వెయ్యరని ప్రశంసించాడు. ఇక్కడి వరకు ఓకే కానీ ఒకటి, రెండు స్టెప్పులను తిప్పి తిప్పి పిప్పి చేసే జాను లిరి.. ఏ పాటకైనా సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే ఆమెను ఢీ విన్నర్‌ను చేయడమే జనం తట్టుకోలేకపోయారు. ఆమెకు సంబంధించిన వీడియో ఏది అప్‌లోడ్ అయినా ఇలాంటి కామెంట్స్ బోలెడు ఉంటాయి. ఇంకొంచెం బూతులు కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ చూసిన జాను పాపం తట్టుకోలేక నిన్నఓ వీడియో రిలీజ్ చేసింది.
ఈ ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నా.. మా అమ్మానాన్న నన్ను ఒక్క మాట కూడా అనకుండా పెంచిండ్రు.. దారిన పోయే వెధవలతో మాటలు పడాల్సి వస్తుందని బాధపడింది. నాకు ఆత్మహత్య తప్ప మరోదారి లేదని ఏడ్చేసింది. దీంతో ఇన్నాళ్లు ట్రోలింగ్ చేసినోళ్లలో కొందరు అయ్యో పాపం అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈరోజు ఇంకో వీడియో రిలీజ్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని షాక్ ఇచ్చింది. కాబోయే వరుడిని కూడా పరిచయం చేసింది. ధైర్యంగా బతుకుతానని ఫిలాసఫీలు చెప్పేసింది. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చినట్లే అయింది.
అమ్మా తల్లి.. నీ యాక్టింగ్ చూస్తే మహానటి సావిత్రిగారు కూడా ఆ బిరుదు నీకే ఇచ్చేవారేమో అని స్పందించారు. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే మాకేమి.. మూడో పెళ్లి చేసుకుంటే మాకేమి.. ఈ సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పడానికేగా ఈ డిప్రెషన్ డ్రామాలన్నీ.. ఒక్కరోజులోనే డిప్రెషన్‌ను జయించావా నువ్వు.. జనాలు ఏమైనా పిచ్చోళ్లు అనుకుంటున్నావా? అంత ఇబ్బంది పడితే సోషల్ మీడియా నుంచి క్విట్ అయిపోవచ్చు కదా అని సలహాలిస్తున్నారు






