డబ్బుల కోసం అమితాబ్ నచ్చని పనులు కూడా చేశాడా?

by Disha Web Desk |
డబ్బుల కోసం అమితాబ్ నచ్చని పనులు కూడా చేశాడా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌‌కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఆయన నటుడుగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రజంట్ మంచి మంచి క్యారెక్టర్‌లు ఎంచుకుంటూ భాషతో సంబంధంలేకుండా భారీ చిత్రల్లో నటిస్తున్నాడు. టెలివిజన్‌లో హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తూ ప్రస్తుతం చాలా సాఫీగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇక ఆరోగ్యం పరంగా ఎన్నోసార్లు చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ అంతే కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చి తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అమితాబ్. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా అమితాబ్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

ఈ మేరకు కొన్నేళ్ల క్రితం అమితాబ్ డబ్బులు లేక బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని, అది కట్టడం కుదరక దివాలా తీసి దారుణమైన పరిస్థితికి చేరుకున్నాడట. వరుస సినిమాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదట. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టే పరిస్థితి లేక తప్పించుకు తిరిగే స్థితికి చేరుకున్నాడట. అప్పుడే ‘అలా బూమ్’ అనే ఒక బి గ్రేడ్ సినిమా అఫర్ వచ్చిందట. కానీ అందులో క్యారెక్టర్ హీరోకి నచ్చలేదు. అయినప్పటికి డబ్బుకోసం వేరె దారిలేక నచ్చని క్యారెక్టర్ కూడా చేశాడు. అదే సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం మొదలైంది. దీంతో అమితాబ్ మళ్లీ తిరిగి సెట్ అయ్యాడట. అలా చిన్న చిన్నగా అప్పులన్నీ తీర్చుకుంటూ మళ్లీ లగ్జరీ లైఫ్‌లోకి వచ్చాడట.

Next Story