రికార్డులు బద్దలు కొడుతున్న ‘ధురంధర్’.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే!

by Mallepaka Hamsa |

రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), ఆదిత్య ధర్(Aditya Dhar) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar).

రికార్డులు బద్దలు కొడుతున్న ‘ధురంధర్’.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే!
X

దిశ, సినిమా: రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), ఆదిత్య ధర్(Aditya Dhar) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar). అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటికీ నుంచి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. సినీ ప్రముఖ ప్రశంసలు పొందడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ.. రికార్డులు కొల్లగొడుతోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 207. 25 కోట్లు కొల్లగొట్టి.. రెండో వారంలోనూ అదే వేగాన్ని కొనసాగించింది. రెండో వారంలో ఏకంగా రూ. 253కోట్లు వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ సినిమా అయినా రెండో వారినే కాస్త కలెక్షన్లు తగ్గుతాయి.

కానీ ‘ధురంధర్’ మాత్రం అదే ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడో వారంలోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టి ‘పుష్ప-2’ రికార్డు‌ను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ‘ధురంధర్’ వరల్డ్ వైడ్‌గా రూ. 905 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వేయి కోట్ల క్లబ్ చేరేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ధురంధర్’ ఘన విజయం సాధించడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 285 కోట్లకు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్.

Next Story