హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై స్పందించిన ‘ధురంధర్’ డైరెక్టర్.. ఏమన్నారంటే?

by Mallepaka Hamsa |

ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్న ‘ధురంధర్’పై సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.

హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై స్పందించిన ‘ధురంధర్’ డైరెక్టర్.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్న ‘ధురంధర్’పై సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ చిత్రాన్ని చూస్తూ నటీనటులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ కొన్ని సీన్స్ తనకు నచ్చలేదని చెప్పడంతో ఆ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నో విషయాలు నచ్చాయని చెప్పిన ఆయన రాజకీయ అంశాలను తాను అంగీకరించనని అన్నారు. హృతిక్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విమర్శలు చేశారు.

అయినప్పటికీ ఆయన స్పందించలేదు. తాజాగా, ఈ విషయంపై ‘ధురంధర్’(Dhurandhar)డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar)రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా సినిమా బాగుందని చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తూనే.. రణ్‌వీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మా చిత్రంపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇందులో పని చేసిన వారంతా వందశాతం కష్టపడ్డారు. హృతిక్ రోషన్ ప్రశంసలకు వారందరూ అర్హులే. దీనికి పార్ట్-2 కూడా తీసుకురాబోతున్నాం. అది తెరకెక్కించేటప్పుడు అందరి సూచనలు దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తాం. వాటికి అనుగుణంగా చేయడానికి మా వంతు ప్రయత్రం చేస్తామని అన్నారు.

ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆదిత్య ధర్, హృతిక్‌కి కౌంటర్ వేశారని చర్చించుకుంటున్నారు. కాగా.. మాధవన్, రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇందులోని యాక్షన్ సీన్స్ అందరినీ భయపెడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా వారం రోజుల్లేనే.. రూ. 230 కోట్లు వసూలు చేసింది.

Next Story