ఓటీటీలోకి ధృవ్ విక్రమ్ ‘బైసన్’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) నటించిన లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison).

ఓటీటీలోకి ధృవ్ విక్రమ్ ‘బైసన్’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) నటించిన లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison). కబడ్డి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)హీరోయిన్‌గా నటించింది. పా రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ శాంతి సినిమా బ్యానర్స్‌పై నిర్మించారు. ఇందులో రెజిషా విజయన్, పశుపతి, అమీర్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా.. అక్టోబర్ 17న తమిళంలో రిలీజ్ చేయగా.. తెలుగులో వారం తర్వాత 24న విడుదల చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 21నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో ఆనందం పెరిగిపోయింది. కాగా..ఒక పేద కుటుంబానికి చెందిన కుర్రాడు అత్యున్నతమైన పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది దీని స్టోరీ. ఈ సినిమా కోసం ధృవ్ మూడేళ్లు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా.. దీనికోసమే వర్క్ చేశారు. ‘బైసన్’ చాలా కష్టపడినప్పటికీ ఫలితం రాలేదు.

Next Story