- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ధనుష్ సూపర్ హిట్ మూవీ .. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
ధనుష్(Dhanush) హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు.

దిశ, సినిమా: ధనుష్(Dhanush) హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇక ఇటీవల ధనుష్ స్వయం దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కడై’(Idli Kadai) బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ధనుష్ హీరోగా, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానే వ్యవహరించారు. ఇక ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటించగా.. షాలిని పాండే, సత్యరాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. వండర్ బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.
ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయిదు భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో జోష్ నెలకొంది.






