- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న ధనుష్ 'సార్' ట్రైలర్!
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సార్'.

దిశ, సినిమా: ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సార్'. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని పరిస్థితులు, అందుకు కారకులవుతున్న వారిపైనా ఒక లెక్చరర్ తిరుగుబాటే ఈ సినిమా కథ. తాజాగా తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ధనుష్, సంయుక్త మీనన్, వెంకీ అట్లూరి, నాగ వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ధనుష్ మాట్లాడుతూ 'మనం ఏ భాషలో నటిస్తున్నమనేది అవసరం లేదు. కంటెంట్ బాగుంటే ప్రతిఒక్కరూ ఏ భాషలో అయిన సినిమాలు చూస్తారు. ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే పరిశ్రమ ఉంది. అది భారతీయ సినిమా పరిశ్రమ. మంచి కథతో నన్ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు వెంకీ అట్లూరి, నాగ వంశీకి కృతజ్ఞతలు' అని చెప్పాడు.






