వినాయక చవితికి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ధనుష్.. ‘ఇడ్లీ కడై’ అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వం వహించడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

వినాయక చవితికి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ధనుష్.. ‘ఇడ్లీ కడై’ అప్డేట్ రాబోతుందంటూ  పోస్ట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వం వహించడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల జాబిలమ్మ నీకు అంత కోపమా, కుబేర వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఇందులో నిత్యా మీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలిని పాండే, పార్తిబన్, సముద్రఖని, రాజ్ కిరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఇడ్లీ కడై’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ధనుష్ సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సూపర్, అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story