‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన ధనుష్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన ధనుష్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ (Nithya Menon)జంటగా నటిస్తుండగా.. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. ‘ఇడ్లీ కడై’ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ నెల 27న రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయంటూ ధనుష్ స్పెడ్స్ పెట్టుకుని జాతరలో రంగులరాట్నం ముందు నిల్చుని ఉండగా.. ఆయన చుట్టూరా పిల్లలు కూడా అద్దాలతో ఫొటోకు పోజులిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

LINK

Next Story