Devi Sri Prasad లైవ్ పర్ఫామెన్స్.. ఫుల్ జోష్‌లో Music Lovers

by Disha Web Desk 7 |
Devi Sri Prasad లైవ్ పర్ఫామెన్స్.. ఫుల్ జోష్‌లో Music Lovers
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు చిరంజీవి, రవితేజ, బాలయ్య వంటి అగ్ర హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి అద్భుతమైన పాటలు, మ్యూజిక్ అందించారు. ఒకప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం అయిన దేవీ.. ఇప్పుడు పలు భారీ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దేవీ.. ఇవాళ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘డీఎస్పీ లైవ్ ఇన్ లండన్’ అంటూ తెలుగు మరియు తమిళ్ రెండు భాషల్లో కూడా తాను చేస్తున్నట్టుగా తెలిపాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్‌లు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. అంతేకాకుండా టికెట్స్ ఓపెన్ అయినట్లు లింకులను కూడా షేర్ చేశాడు. దీనిని రెయిన్‌బో స్కై వారు నిర్వహిస్తున్నారు. ఇది 2024 జనవరిలో 13, 14 వ తేదీల్లో జరగనుంది. దీంతో ఈ పోస్ట్ చూసిన మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Bunny తో Atlee కాంబో ఫిక్స్.. ఐకాన్ స్టార్ దిమ్మతిరిగిపోయే Remuneration?



Next Story

Most Viewed