‘డెవిల్’.. 500 మంది ఫైటర్స్‌తో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ

by Disha Web Desk 13 |
‘డెవిల్’.. 500 మంది ఫైటర్స్‌తో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్‌తో దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న సినిమాకు న‌వీన్ మేడారం ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్నట్లు తెలిపిన మేకర్స్.. క్లైమాక్స్‌ ఫైట్‌ను 500 మందితో తెర‌కెక్కిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఫైట్‌ను వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా ఫైట్ మాస్టర్ వెంక‌ట్ ఆధ్వర్యంలో డిజైన్ చేస్తున్నామన్నారు.

‘మా బ్యానర్‌పై ‘డెవిల్’ సినిమాను ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్నాం. ప్రేక్షకుల‌కు కొత్త సినిమాల‌ను అందించాల‌ని త‌ప‌నపడుతున్న క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్పగా పిక్చరైజేష‌న్ ఉంటుంది. త్వర‌లోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తాం’ అన్నారు నిర్మాత అభిషేక్ నామా.



Next Story

Most Viewed