దేవేరి’.. మార్చి 19న వస్తున్న ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్

by Disha Web Desk 6 |
దేవేరి’.. మార్చి 19న వస్తున్న ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: అల్లరి నరేష్, మిర్నా జంటగా వస్తున్న చిత్రం ‘ఉగ్రం’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో విజయ్ కనకమేడల తెరకెక్కించారు. కాగా ఈ మూవీలో నరేష్‌ను ఫెరోషియస్ పోలీస్‌‌గా చూపించబోతుండగా ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘దేవేరి’ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వర్షంలో బైక్‌‌పై కూర్చున్న హీరోహీరోయిన్ల స్టిల్స్ చూస్తేంటే ‘దేవేరి’ ఒక అందమైన రొమాంటిక్ మెలోడీలాగే అనిపిస్తుంది. ఇక ఈ వేసవిలోనే థియేటర్లలో విడుదలకాబోతున్న మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు.


Next Story

Most Viewed