ఓటీటీ హక్కుల గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన ‘దేవర’ టీం..

by Disha Web Desk 7 |
ఓటీటీ హక్కుల గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన ‘దేవర’ టీం..
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా ‘దేవర’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో రివీల్ చేశాడు ఈ మూవీ ప్రొడ్యూసర్, తారక్ అన్న నందమూరి కల్యాణ్ రామ్. తాను నటించిన ‘డెవిల్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. ‘ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తమ మూవీ హక్కులు సొంతం చేసుకుంది. ఇప్పటికే ‘దేవర’ తొలి భాగంలోనే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయనున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తయింది’ అని తెలిపాడు కళ్యాణ్ రామ్.

Read More..

‘నీలాంటి మగాడు ఎక్కడా దొరకడు’.. ఆ హీరోపై రకుల్ ఎమోషనల్ పోస్ట్..

Next Story

Most Viewed