ఇండస్ట్రీలో భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ .. పోరాడలేకపోయాను : షాహిద్ కపూర్

by Dishafeatures1 |
ఇండస్ట్రీలో భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ .. పోరాడలేకపోయాను : షాహిద్ కపూర్
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నెపోటిజం తప్పకుండా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ..తమ సొంత ట్యాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ ఒకరు. అదేంటి షాహిద్ కపూర్ కి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా.. అని అనుకుంటున్నారు కదా..? అయితే భారీ బ్యాగ్రౌండ్ ఉన్న కూడా దాని ఉపయోగించుకోకుండా తన సొంత టాలెంట్‌ని నమ్ముకొని ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు షాహిద్.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ తన కెరీర్ తొలి నాళ్ళలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి, అంత ఈజీగా బాలీవుడ్‌ అవకాశాలు ఇవ్వదు. నా పేరెంట్స్ నటులైనప్పటికీ వాళ్ల పేర్లు వాడుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. అయితే కెరీర్ మొదట్లో కొందరు నను హీనంగా చూసేవారు. ఎంతగానో బాధపడ్డాను.. టీనేజ్‌ల్లో పోరాడలేకపోయాను. కానీ ఇప్పుడు ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టిన.. లేదంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన చూస్తూ ఊరుకోను’ అంటూ షాహిద్ కపూర్ తెలిపాడు. ప్రజంట్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

అంబానీ ప్రీ-వెడ్డింగ్‌లో సల్మాన్ ఖాన్ స్పెషల్ షో.. దీని కోసం ఎంత డబ్బు వసూలు చేస్తున్నాడంటే?


Next Story