- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఫ్లాప్స్.. అయినా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న యంగ్ బ్యూటీ
'పెళ్ళి సందడి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: 'పెళ్ళి సందడి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 'ధమాకా'తో మాస్ రాజా సరసన అదిరిపోయే స్టెప్పులేసి గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. తెలుగులో టాప్ హీరోలందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ ఒకానొక సమయంలో 'బిజీయెస్ట్ హీరోయిన్'గా పేరు తెచ్చుకున్న శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది.
అలా తన అందం, అద్భుతమైన డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన శ్రీలీల, ఇటీవల ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, కథనంలో లోపాల వల్ల బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆమె ఆశలకు కొంత నిరాశ ఎదురైంది. 'పరాశక్తి' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గలేదు.
తాజా సమాచారం ప్రకారం, యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించబోయే కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాలో శ్రీలీలను రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరిని ప్రధాన కథానాయికగా ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఈ చిన్నదాని ఖాతాలో హిట్ పడుతుందో లేదో చూడాల్సి ఉంది.






