- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Demonti Colony-2: ఆగస్టు రేసులో బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సీక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
2015లో వచ్చిన హారర్ అండ్ థ్రిల్లర్ చిత్రం ‘డిమోంటి కాలనీ’ అందరికి గుర్తుండే ఉంటుంది.

దిశ, సినిమా: 2015లో వచ్చిన హారర్ అండ్ థ్రిల్లర్ చిత్రం ‘డిమోంటి కాలనీ’ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి సక్సెస్‌ను అందుకుంటి. దాదాపు 8ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీకి ‘డిమోంటి కాలనీ-2’ ని తెరకెక్కిస్తున్నారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తి రచన అండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నితి, ప్రియా శంకర్‌లు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ‘డిమోంటి కాలనీ -2’ నుంచి వచ్చిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించగా.. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఆగస్టు 15న తమిళ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానున్నట్లు తెలిపింది చిత్ర బృందం. అయితే.. ఇప్పటికే ఆగస్టు 15న రిలీజ్ అయ్యేందుకు తెలుగుతో పాటు తమిళంలో కూడా నాలుగు, ఐదు చిత్రాలు లైన్‌లో ఉండగా.. ఇప్పుడు ఆగస్టు రేసులో ‘డిమోంటి కాలనీ - 2’ కూడా చేరిపోయింది.






