‘బలగం’ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

by Kodari Anjali |   (  Updated:2023-04-12 07:42:13  IST  )

అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘‘బలగం’’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

‘బలగం’ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘‘బలగం’’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా పై ఫిర్యాదు అందింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. తమను కించపరిచేలా ఉన్న సీన్లు చాలా బాధించాయని.. తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తమకు ఇబ్బందిగా ఉన్న సీన్లు తీసేసి, దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Akhil Akkineni : చైతూ పైకి కనిపించినంత సైలెంట్ కాదు: అఖిల్ కామెంట్ వైరల్

Next Story