- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపికా డిమాండ్ చేస్తున్న దాంట్లో తప్పేముంది.. మేమూ మనుషులమే మా కూడా బ్రేక్స్ కావాలి: షాలిని పాండే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలోనే.. ఈ అమ్మడు రెండు భారీ ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాతో పాటు, కల్కి-2 నుంచి దీపికాను తీసేసి మరో హీరోయిన్లను పెట్టుకున్నారు. అందుకు కారణం ఆమె రోజులో కేవలం 8గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడంతో వివాదం మొదలైనట్లు టాక్.
గత కొద్ది కాలంగా ఆమె సైలెంట్‌గా పోరాటం చేస్తున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా కొంతమంది స్టార్ హీరోలు వారంలో 6 రోజుల పాటు, రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తారని వారి పేర్లను రివీల్ చేయాలనుకోవడం లేదని చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ బ్యూటీ షాలిని పాండే, దీపికాకు సపోర్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘దీపికాను తొలగించిన ప్రాజెక్ట్‌లలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం.
స్కూల్‌లో చదువుకునేటప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను. తనొక గొప్ప యాక్టర్ దీపికాకు ఏది అవసరమో అది నిర్భయంగా మాట్లాడుతుంది. తన వల్లే మేమంతా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడగలుగుతున్నాం. మేమూ మనుషులమే.. మాకూడా చిన్నపాటి బ్రేక్ కావాలి. దీపికా డిమాండ్ చేస్తున్నది ఆమెకు దక్కాలి. అందులో తప్పేముంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






