- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు పాఠం నేర్పారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. హాట్ టాపిక్‌గా మారిన దీపికా పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit)సినిమా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రెమ్యునరేషన్ విషయంలో డైరెక్టర్‌తో వివాదం ఏర్పడటంతో ఆమె ప్లేస్‌లో త్రిప్తిని సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో పాటు ఈ అమ్మడుని ‘కల్కి-2’(Kalki-2) నుంచి కూడా తొలగించేశారు. అంతేకాకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఆమెకు కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈక్రమంలో.. తాజాగా, దీపికా పదుకొణె ఓ స్టార్ హీరో పాఠం నేర్పినట్లు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే.. సినిమా విజయం కంటే ప్రాధాన్యమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలనే పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్నే అమలు చేస్తున్నాను.
6 ఏళ్ల తర్వాత మళ్లీ మేము కలిసి నటించబోతున్నాం’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడు ‘కల్కి-2’ నుంచి తొలగించేయడం వల్లే ఇలా పెట్టిందని అంతా చర్చించుకుంటున్నారు. కాగా.. దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ 6 ఏళ్ల తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో ‘కింగ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద దర్శకత్వంలో రాబోతుంది.






