- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deepika Padukone: తల్లి కాబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన దీపికా పదుకొణె.. ఇండస్ట్రీకి దూరం కానుందా?
దీపికా షేర్ చేసిన ఫోటోలో వారి గారాల పట్టి దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో రెండు గులాబీ రంగు గీతలు పాజిటివ్ రిజల్ట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ ఇంట్లో త్వరలోనే మరోసారి సందడి మొదలుకాబోతోంది. ఈ స్టార్ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీపికా సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రకటన కోసం దీపికా ఎంచుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. దీపికా షేర్ చేసిన ఫోటోలో వారి గారాల పట్టి దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో రెండు గులాబీ రంగు గీతలు పాజిటివ్ రిజల్ట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణవీర్, దీపికా ఇద్దరూ కలిసి తమ కూతురు చేతిని పట్టుకుని ఉన్న ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
దువా ఇప్పుడు ‘పెద్దక్క’ కాబోతోందంటూ దీపికా ఈ పోస్ట్‌కు కేవలం దిష్టి చుక్క ఎమోజీలను క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇక ఈ వార్త విన్న అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి పరిణీతి చోప్రా, సమంత రూత్ ప్రభు వంటి వారు హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను చాటుకున్నారు. దువాకు తోడు రాబోతోంది, మరో మినీ దీపికా రాబోతుందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 2024 సెప్టెంబర్‌లో దువా పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏడాదిన్నర తిరగకముందే రెండో బిడ్డ వార్త రావడంతో దీపికా-రణవీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. కాగా.. ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు ఈ జంట సినిమాలతోనూ దూసుకుపోతున్నారు. దీపికా పదుకొణె తన మొదటి బిడ్డ దువా పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలు అందుకుంటోంది.
త్వరలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో కనిపించనుంది. ఇది డిసెంబర్ 24, 2026న విడుదల కానుంది. అలాగే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ‘రాకా’ చిత్రంలోనూ ఆమె నటించబోతోంది. ఇక దీపికా తల్లి కాబోతున్నట్లు తెలుసుకున్న వారంతా.. ఆమె ఒప్పుకున్న ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేసి మొత్తానికి ఇండస్ట్రీకి దూరం కానుందా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే, ఆయన నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1,700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆయన కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి ‘ప్రళయ్’ అనే ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.






