బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. 'సింగం ఎగైన్' సెట్ ఫోటోలు వైరల్..

by Disha Web Desk 20 |
బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. సింగం ఎగైన్ సెట్ ఫోటోలు వైరల్..
X

దిశ, సినిమా : బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. వరుస చిత్రాల్లో నటిస్తూ ఎన్నో హిట్లు కొట్టిన దీపిక స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అంతే కాదు సెప్టెంబర్ 2024లో బిడ్డను కూడా కనబోతోంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శెట్టి చిత్రం 'సింగం ఎగైన్' సెట్స్ నుండి కొన్ని చిత్రాలు బయటికొచ్చాయి. దీపికా ఈ ఫోటోల్లో బేబీ బంప్‌తో కనిపించింది. ఇది చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సింగం ఎగైన్' చిత్రంలో దీపికా పదుకొణె 'లేడీ సింగం'గా కనిపించనుంది. ఆమెలుక్ ఒకటి గత సంవత్సరం 2023లో రివీల్ అయింది. ఇందులో ఆమె రక్తంతో తడిసిన పోలీసు యూనిఫారంలో కనిపించింది. ఇప్పుడు మరోసారి పోలీసు యూనిఫాంలో దీపికా కనిపించింది. ఈ పిక్ లో రోహిత్ శెట్టి కూడా ఉన్నారు. వైరల్ అవుతున్న ఫోటోలలో దీపికా పదుకొనే బేబీ బంప్ కనిపిస్తుంది. బేబీబంప్ లో ఇంత బిగించిన దుస్తులలో కనిపించడం ఇదే తొలిసారి.

Next Story

Most Viewed