Deepika Padukone: ఫ్యాన్స్‌తో బెడ్‌రూమ్ పిక్‌ను పంచుకున్న దీపికా పదుకొణె

by Disha Web Desk 4 |
Deepika Padukone: ఫ్యాన్స్‌తో బెడ్‌రూమ్ పిక్‌ను పంచుకున్న దీపికా పదుకొణె
X

దిశ, సినిమా: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో దీపికా పదుకొణె పేరు టాప్‌లో ఉంటుంది. ఫ్యాన్స్‌తో తన డైలీ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా‌లో పంచుకుంటునే ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్‌తో 'ఆస్క్ మీ ఎనితింగ్' అంటూ కలిసి ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఫ్యాన్స్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ' తాను ఒక ప్రదేశం అయితే తనని తాను ఏమని పిలుస్తారు ' అని అడగ్గానే తన బెడ్‌రూమ్ ఫోటోను షేర్ చేసింది. తాను షేర్ చేసిన పిక్ లో చుట్టూ ప్రశాంతంగా ఉన్న బెడ్‌రూమ్‌లో దీపికా బెడ్ పై కూర్చుని స్మైల్ చేస్తూ ఉంది. ఇదే ఫ్లో‌లో మరొక అభిమాని మీకు ఇష్టమైన కార్ ఏది అంటూ ప్రశ్నించాడు. దీపిక ఈ ప్రశ్నకు 'ఫియాట్ ప్రీమియర్ పద్మిని' కార్‌ను అభిమాని ప్రశ్నకు టాగ్ చేసి రిప్లై ఇచ్చింది. ఇవే కాకుండా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల్లో నచ్చిన కలర్,ఇష్టంగా తాగే డ్రింక్ ఇలా అన్నింటికి సమాధానాలిస్తూ తన అభిమానులను ఆనందపరిచింది దీపిక.



Next Story

Most Viewed