గోల్డ్ కలర్ మోనోకినీలో అబ్బురపరిచిన Deepika Padukone.. నెటిజన్లు ఫిదా

by Hamsa |
గోల్డ్ కలర్ మోనోకినీలో అబ్బురపరిచిన Deepika Padukone.. నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె బంగారు రంగు మోనోకినిలో దర్శనమిచ్చి అభిమానులను అబ్బురపరిచింది. షారుఖ్-దీపిక కలయికలో వస్తున్న అప్ కమింగ్ మూవీ 'పఠాన్' 2023 జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీమ్.. ఒక్కో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి మొదటిపాట 'బేషరమ్ రంగ్'ను డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఈ సాంగ్‌ నుంచి దీపిక ఫస్ట్ లుక్‌ను నెట్టింట పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడిన నటి.. గోల్డ్ కలర్ మోనోకిని ధరించి ఎండలో నిలబడి రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. కాగా ఆమె హాటెస్ట్ అవతార్‌, కొంటె చూపులు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్ల తమదైన స్టైల్‌లో స్పందిస్తుండగా.. సూపర్ హిట్ జోడి కాంబోలో వస్తున్న 'పఠాన్' సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

మల్టీ కలర్ బికినీలో మత్తెక్కించిన Janhvi Kapoor. అబ్స్‌పైనే కన్నేసిన కుర్రాళ్లు

Next Story

Most Viewed