- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపికా పదుకొణె- సందీప్ రెడ్డి వంగా పంచాయితీ.. హాట్ టాపిక్‌గా మారిన మణిరత్నం కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె(Deepika Padukone)ను సెలెక్ట్ చేసుకున్నట్లు గత కొద్ది కాలంపాటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్ గురించి డిమాండ్ చేయడంతో సందీప్ రెడ్డి వంగా ఆమెను తొలగించారు. ఇక ప్రభాస్ సరసన నటించేందుకు త్రిప్తి డిమ్రి(Tripti Dimri)ని కన్ఫార్మ్ చేస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో అయితే దీపికా పీఆర్ ‘స్పిరిట్’ స్టోరీని లీక్ చేస్తానని అనడంతో సందీప్ వారికి మాస్ వార్నింగ్ ఇస్తూ పెట్టిన పోస్ట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక దీనికి దీపికా కూడా తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. వీరిద్దరి పంచాయితీ రోజు రోజుకు ముదురుతోంది తప్ప సర్దుమనగడం లేదు.
తాజాగా, ఈ విషయంపై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం స్పందించారు. ‘‘ఇండస్ట్రీలో నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటి నిర్ణయం సరైనదని నేను భావిస్తున్నాను. పని గంటల విషయంలో అలా అడిగే నటీనటులు ఇంకా చిత్రపరిశ్రమలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా అడగడంలో తప్పుల లేదని నేను ఒక దర్శకుడిగా చెబుతున్నాను. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సందీప్ రెడ్డి వంగాదే తప్పు అందుకే మణిరత్నం దీపికకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అని చర్చించుకుంటున్నారు.






