ఫ్లైట్‌లో హీరో భార్యపై ముద్దుల వర్షం.. ప్రయాణికులు షాక్

by Disha Web |
ఫ్లైట్‌లో హీరో భార్యపై ముద్దుల వర్షం.. ప్రయాణికులు షాక్
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టార్ నటి దీపికా పడుకొణెను ముద్దుపెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వీరిద్దరు దుబాయ్ నుంచి ముంబైకి తిరిగొస్తుండగా అనుకోకుండా ఒకే ఫ్లైట్‌లో కలుసుకోవడంతో ఒకరిని చూసి ఒకరు షాక్ అయ్యారు. దీంతో ఆనందాన్ని తట్టకుకోలేకపోయిన ఊర్వశి.. దీపిక రెండు చెంపలను చేతులతో పట్టుకుని అందరిముందే గాఢంగా ముద్దిచ్చింది.

ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను దీపిక అభిమాని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ బయటకొచ్చిన దీపికను ముద్దు గురించి ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ కారెక్కి వెళ్లిపోవడం విశేషం. ఇక దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'ఆమె చిరునవ్వు అద్భుతమైనది', 'ఉమెన్ విత్ క్లాస్ అండ్ గ్రేస్' 'ఎలిగెంట్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీఫుల్' అంటూ పొగిడేస్తున్నారు.

Also Read: పెళ్లికి ముందే స్టార్ కిడ్స్ గర్భం.. తల్లి సంచలన కామెంట్స్Next Story

Most Viewed