కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్.. సందీప్ రెడ్డి వంగా రియాక్షన్ ఇదే.. అట్లీ కూడా అదే పనిలో..

by Sujitha Rachapalli |

హీరోయిన్ దీపికా పదుకొణేను ‘స్పిరిట్’ నుంచి తొలగించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందుగా ఆమెను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినా.. ఆ తర్వాత కమిట్మెంట్,

కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్.. సందీప్ రెడ్డి వంగా రియాక్షన్ ఇదే.. అట్లీ కూడా అదే పనిలో..
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ దీపికా పదుకొణేను ‘స్పిరిట్’ నుంచి తొలగించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందుగా ఆమెను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినా.. ఆ తర్వాత కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, టైమ్ ఫ్లెక్సిబిలిటీ, రెమ్యూనరేషన్ ఇష్యూస్‌తో రిమూవ్ చేస్తున్నట్లు ప్రకటించారు వంగా. దీంతో పీఆర్ స్టంట్స్ చేసిన దీపిక.. సింపతీ గెయిన్ చేసేందుకు విక్టిమ్ కార్డు ప్లే చేసింది. కానీ అలాంటి పీఆర్ స్టంట్స్ వర్క్ చేయకుండా గట్టిగానే రిప్లయ్ ఇచ్చాడు డైరెక్టర్. ఈవెన్ స్పిరిట్ స్టోరీ కూడా లీక్ చేసిందని ఆరోపించాడు. ఈ క్రమంలో పెద్ద సోషల్ మీడియా వార్ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫేడ్ అయిపోయింది.

కానీ తాజాగా వైజయంతి మూవీస్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థ కూడా కమిట్మెంట్ లేని కారణంగా దీపికను పక్కన పెట్టేసింది. కల్కి సీక్వెల్‌లో ఆమె ఉండబోదని అఫిషియల్‌గా ప్రకటించింది. దీంతో చాలా మంది మంచి పని చేశారని కామెంట్స్ చేస్తుండగా.. సందీప్ రెడ్డి వంగా రియాక్షన్ ఎలా ఉంటుందో నెటిజన్లు ఇమాజిన్ చేస్తున్నారు. పగలబడి నవ్వుతున్నాడని కొందరు అంటుంటే.. నేను ముందే చెప్పాను కదా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ఇప్పటికే దీపిక ఫైనల్ కాగా అన్‌ప్రొఫెషనల్ బిహేవియర్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టేయాలని డిసైడ్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Next Story