Deepika Padukone’s First Look Poster From Project K : ‘ప్రాజెక్ట్ కే’ నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్

by samatah |   (  Updated:2023-07-19 11:54:52  IST  )

ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. అభిమానులంతా ‘ఆదిపురుష్’పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రజంట్ అందరి దృష్టి ‘ప్రాజెక్ట్ కే’ పైన ఉంది. ఇక దర్శకుడు

Deepika Padukone’s First Look Poster From Project K : ‘ప్రాజెక్ట్ కే’ నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. అభిమానులంతా ‘ఆదిపురుష్’పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రజంట్ అందరి దృష్టి ‘ప్రాజెక్ట్ కే’ పైన ఉంది. ఇక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరక్కెకిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలకానుంది. అయితే తాజాగా ఈ దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. లేడీ వారియర్ గెటప్‌లో ఆమె అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ అనుకున్నంతగా లేదంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్‌తో పాటు జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ వేదికగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Read More: ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ‘బేబీ’ చిత్రం యాక్టర్

Next Story