- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దీపికకు మరో షాక్.. ఆ సినిమా నుంచి కూడా అవుట్.. వైరల్ అవుతున్న పోస్ట్..
దీపిక పదుకొణే వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్‌మెంట్స్, హై రెమ్యూనరేషన్ కారణంగా సందీప్ రెడ్డి వంగా తన మూవీ ‘స్పిరిట్’ నుంచి తీసేశారు. దీంతో పీఆర్ స్టంట్ చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. డైరెక్టర్ ఎదురుదాడి చేయడంతో తోకముడిచేసింది బాలీవుడ్ పీఆర్ మాఫియా. ఆ తర్వాత కాజోల్, అజయ్

దిశ, ఫీచర్స్ : దీపిక పదుకొణే వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్‌మెంట్స్, హై రెమ్యూనరేషన్ కారణంగా సందీప్ రెడ్డి వంగా తన మూవీ ‘స్పిరిట్’ నుంచి తీసేశారు. దీంతో పీఆర్ స్టంట్ చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. డైరెక్టర్ ఎదురుదాడి చేయడంతో తోకముడిచేసింది బాలీవుడ్ పీఆర్ మాఫియా. ఆ తర్వాత కాజోల్, అజయ్ దేవగన్, రాధికా ఆప్టే, సైఫ్ అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీలు దీపికకు ఇండైరెక్ట్‌గా మద్దతిచ్చిన అదంతా ప్రొఫెషనల్ ఆన్సర్ అనిపించుకోలేదు. అయితే తాజాగా మరో విషయం వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’లో దీపిక కీ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో హీరో ప్రభాస్‌కు ధీటైన్ రోల్ అందుకున్న దీపిక.. సీక్వెల్‌లో మాత్రం ఉండదనే విషయం హల్ చల్ చేస్తోంది.
అవును.. బాలీవుడ్ మీడియా ప్రచారం ప్రకారం.. ‘కల్కి 2’లో దీపిక ఉండదనే తెలుస్తోంది. పాప కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని దీపిక రిక్వెస్ట్ చేసినా.. సినిమాకు సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు టాక్. ఈ హీరోయిన్ ప్లేస్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీకి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు మేకర్స్, ఇటు దీపిక ఇప్పటి వరకు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.






