ఇండస్ట్రీలో జాతిపరమైన మూస పద్ధతులున్నాయి: దీపిక

by Disha Web |
ఇండస్ట్రీలో జాతిపరమైన మూస పద్ధతులున్నాయి: దీపిక
X

దిశ, సినిమా : స్టార్ నటి దీపిక పదుకొణె హాలీవుడ్‌లో జాతిపరమైన భయంకర మూస పద్ధతులన్నాయంటోంది. ప్రస్తుతం ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ‌గా ప్రశంసలు అందుకుంటోన్న దీపిక.. తాజా ఇంటర్వ్యూలో పాశ్చాత్యుల కల్చర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ మేరకు తాను అమెరికాకు వెళ్లిన ప్రతిసారీ ఫారినర్స్ తనను బయటి వ్యక్తిగా ప్రత్యేకంగా చూస్తూ కలతపెట్టే చర్యలకు పాల్పడ్డారని, ఎన్నోసార్లు వాళ్ల కారణంగా బాధపడ్డట్లు చెప్పింది. ఈ కారణంగానే తాను గ్లోబల్ సినిమాలు చేయడానికి ఇష్టపడట్లేదన్న ఆమె.. వానిటీ ఫెయిర్ పార్టీలో కలిసి ఒక నటుడు తనను 'నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావ్' అని చెప్పినట్లు గుర్తుచేసుకుంది.

అయితే అతని మాటలకు అర్థం ఏమిటో తెలియలేదన్న నటి.. 'అసలు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడతావ్ అంటే ఏమిటి? మనకు ఆంగ్లం రాదనే భావన అతనికి ఉందా?' అని తర్వాత తెలుసుకుని ఫీల్ అయినట్లు తెలిపింది. చివరగా ఏదేమైనప్పటికీ ఈ రోజు భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్న బ్యూటీ.. మన స్వదేశీ బ్రాండ్‌లు, చరిత్ర, సంస్కృతి, వారసత్వం వంటి వాటిని చూస్తూ ఎల్లప్పుడూ గర్వపడాతనని పేర్కొంది.

ALSO READ : 20 ఏళ్ల అమ్మాయితో 50ఏళ్ళ హీరో రొమాన్స్.. బాగుందన్న అయేషా


Next Story