20 ఏళ్ల అమ్మాయితో 50ఏళ్ళ హీరో రొమాన్స్.. బాగుందన్న అయేషా

by Disha Web Desk 16 |
20 ఏళ్ల అమ్మాయితో 50ఏళ్ళ హీరో రొమాన్స్.. బాగుందన్న అయేషా
X

దిశ, సినిమా : సీనియర్ నటి అయేషా జుల్కా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 90ల్లో తనతో నటించిన హీరోలు ప్రస్తుతం 50 ఏళ్లు దాటినా 20 ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయడం చూసి ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. అలాగే ఇటీవల కాలంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లాంటి నటులంతా అతిచిన్న వయసున్న మహిళలతో చిందులేయడం, ముద్దు తదితర సీన్లలో ఎలాంటి సందేహం లేకుండా నటించడంపై విమర్శలు వస్తున్నప్పటికీ తనకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.

అంతేకాదు వాళ్లంతా ఇప్పటికీ తెరపై యవ్వనంగా కనిపిస్తున్నారని, ఒకవేళ ప్రేక్షకులు వాళ్లను ఇష్టపడకపోతే వారి సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయన్న జుల్కా.. నటులుగా రోజురోజుకు ఎదుగుతూ ఎంతో కష్టపడుతున్నారంటూ ప్రశంసలు కురిపించింది. ఇక తన సహనటులు ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్నో రిస్క్‌లు చేస్తున్నారనడానికి తనే సాక్షినని పేర్కొన్న ఆమె.. ఆ శ్రమకు తగిన ఫలితం లభించాల్సిందేనంటూ చెప్పుకొచ్చింది. చివరగా ఆ కాలంలోనే కాదు ఇప్పుడు కూడా పరిశ్రమలో మహిళల షెల్ఫ్ లైఫ్ దురదృష్టవశాత్తు అంతే ఉందని, దానికి సమాధానం మాత్రం తనదగ్గర లేదన్న నటి.. అతిచిన్న వయసున్న హీరోయిన్లను సీనియర్లు ప్రేమిస్తున్నారనే వాస్తవంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదనడం విశేషం.

ALSO READ : ఇండస్ట్రీలో జాతిపరమైన మూస పద్ధతులున్నాయి: దీపిక


Next Story

Most Viewed